భారతదేశం, డిసెంబర్ 22 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం, జనవరి 15న శుక్రుడు, శని 90 డిగ్రీల కోణంలో ఉంటారు. ఈ రెండు గ్రహాలు ఇలా ఉండడంతో లాభదృష్టి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఏ రాశుల వారికి మంచి ఫలితాలను తీసుకురాబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడే తెలుసుకుందాం.

శుక్రుడు సంపద, డబ్బు, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. శని మనం చేసే పనులను, ఫలితాలను బట్టి ఫలితాలను ఇస్తాడు. ఈ రెండు గ్రహాలు 90 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారి కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ప్రమోషన్లు వస్తాయి, జీతం పెరుగుతు...