భారతదేశం, నవంబర్ 17 -- రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయి అనేది చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. జ్యోతిషశాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఒక్కో రాశి విధంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి కొన్ని బలాలు ఉంటాయి, అయితే అవే కొన్ని రాశుల వారికి బలహీనతలు కావచ్చు. ఈ రాశుల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మాత్రం ఆ భర్త చాలా అదృష్టవంతుడు. అత్తవారింట్లో ఏ రాశుల అమ్మాయిలు ఉత్తమ కోడలుగా పేరు తెచ్చుకుంటారు? మరి ఆ రాశుల వారు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో తెలుసుకోండి.

ప్రతి పురుషుడు కూడా ఒక మంచి భార్య జీవితంలోకి రావాలని, తన అమ్మానాన్నలను బాగా చూసుకోవాలని, మంచి కోడలుగా ఆమె పేరు తెచ్చుకోవాలని అనుకుంటారు. కుటుంబం సంతోషంగా, కలిసిమెలిసి ఉండాలంటే ఆ కోడలి పాత్ర చాలా ముఖ్యమైనద...