Hyderabad, సెప్టెంబర్ 26 -- వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళుతూ ఉంటాయి. అక్టోబర్ 6న శని,చంద్రుల సంయోగం చోటు చేసుకోనుంది. ఈ యోగం చాలా ప్రమాదకరమైనది. ఇది కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను తీసుకురానుంది. గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో శుభ యోగాలు, అశుభ యోగాలు సహజంగా ఏర్పడుతూ ఉంటాయి.

ప్రస్తుతం శని మీన రాశిలో ఉన్నాడు. అక్టోబర్ 6న చంద్రుడు కూడా మీనరాశిలోకి అడుగుపెడతాడు. ఈ రెండిటి సంయోగం కారణంగా కొన్ని రాశుల వారు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆరోగ్యపరంగా సమస్యలు రావచ్చు. డబ్బును ఖర్చు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి.

ఆర్థికపరంగా కూడా చిన్నపాటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మరి ఏ ఏ రాశుల ...