Hyderabad, సెప్టెంబర్ 13 -- Generous partners zodiac signs: రాశుల ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉన్నాయనేది చెప్పడంతో పాటుగా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పచ్చు. ఈ రాశుల వారిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. ఎప్పుడు కూడా జీవిత భాగస్వామిని ఎంతో ఇష్టంగా ప్రేమిస్తారు, అర్థం చేసుకుంటారు, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు, అనుక్షణం వారిని ఎక్కువ శ్రద్ధతో చూసుకుంటారు.

మరి ఏ రాశుల వారు జీవిత భాగస్వామిని బాగా చూసుకుంటారు? ఎవరు మంచి మనసుతో ప్రేమిస్తారు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి వారు వారి జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. వారిని అనుక్షణం జాగ్రత్తగా చూసుకుంటారు. ముఖ్యంగా మానసిక శ్రేయస్సు కలిగి ఉండేటట్టు చూసుకుంటారు. ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారు ఎప్ప...