భారతదేశం, జనవరి 20 -- జనవరి 25న రథసప్తమి. ఆ రోజు చంద్రుడికి చెందిన శ్రవణ నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వలన కొన్ని పనులు చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మరి ఏ రాశుల వారికి రథసప్తమి బాగా కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో తెలుసుకుందాం. ఈ రాశుల వారు ఆదిత్య హృదయం పఠిస్తే కూడా మంచి జరుగుతుంది.

మేష రాశి వారికి సూర్యుని మార్పు వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు ప్రయత్నాలు చేపడితే బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పదోన్నతి, ఉద్యోగం, విదేశీ ఉద్యోగాలు వంటి ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి సులువుగా బయటపడతారు.

వృషభ రాశి వారికి ఇది మంచి సమయం. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. ఆ...