Hyderabad, ఆగస్టు 13 -- మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ 'మంజుమ్మల్ బాయ్స్'తో అక్కడి నటుడు సౌబిన్ షాహిర్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కూలీ'లో ఒక కీలకమైన విలన్ పాత్రతో అతడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.

'కూలీ'లోని ప్రత్యేక సాంగ్ 'మోనికా'లో తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో సౌబిన్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ పాటలో పూజా హెగ్డేను కూడా అతడు డామినేట్ చేశాడని ప్రేక్షకులు అంటున్నారు. రజనీకాంత్ ప్రశంసలు కూడా అందుకున్న ఆ నటుడి మరిన్ని హిట్ మూవీస్ ఏ ఓటీటీల్లో చూడాలో తెలుసుకోండి.

శ్రీరాజ్ శ్రీనివాసన్ రాసి, దర్శకత్వం వహించిన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌ ప్రావీన్‌కూడు షాప్పులో సౌబిన్ షాహిర్.. నటుడు-దర్శకుడు బేసిల్ జోసెఫ్ తో కలిసి నటించాడు. భారీ వర్ష...