Hyderabad, Oct. 26 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడూ ఫ్రెష్ కంటెంట్ వస్తూనే ఉంటోంది. ఇక డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చి ఎంటర్ టైన్ చేసే సినిమాలు, సిరీస్ లు ఎన్నో. ఇప్పుడు ఆ కోవలోనే మరో మూవీ నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇది యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. ఆ సినిమా పేరు ‘రిధి’.

రిధి ఓటీటీ రొమాంటిక్ లవ్ స్టోరీ రిధి ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఇవాళ (అక్టోబర్ 26) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీలో ప్రతి సండే ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. కథా సుధలో భాగంగా ఆ చిన్న సినిమాలు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఈ ఆదివారం ఈ వరుసలోనే రిధి డిజిటల్ ప్రేక్షకులకు లవ్ ను పంచేందుకు వచ్చేసింది.

ఈటీవీ విన్ కథాసుధ ఈటీవీ విన్ ఓటీటీలో ప్రతి ఆదివారం కథా సుధలో భాగంగా ఓ చిన్న సినిమా స్ట్ర...