Hyderabad, ఆగస్టు 25 -- రాశుల ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి, ప్రవర్తన తీరు ఎలా ఉంటుందని చెప్పడంతో పాటు భవిష్యత్తు ఎలా ఉంటుందని కూడా చెప్పవచ్చు. అయితే మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి. ఒక్కో రాశి వారి పేరు, ప్రవర్తన ఒక్కో విధంగా ఉంటుంది. ఈ రాశులు వారు ప్రేమించిన వారిని ఎప్పుడూ మోసం చేయరు.

ప్రేమలో ఎంతో నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఈ రాశి వారు ప్రేమిస్తే మోసం చేయడం, ప్రేమ తగ్గిపోవడం లాంటివి ఏమీ ఉండవు. జీవితాంతం ప్రేమించిన వ్యక్తిని ఎంతో ఇష్టంగా చూసుకుంటారు. ఆ ప్రేమ ఎప్పటికీ తరిగిపోదు. మరి అటువంటి వారు ఎవరు? ఆ రాశిలో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.

మేష రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారు ఎవరినైనా ప్రేమిస్తే వారిని మోసం చేయరు. ఎంతో ఇష్టంగా చూసుకుంటారు. వీరి ప్రేమను పెళ్లి దాకా కూడా తీసుకు వెళ్తారు. వీరిని కళ్ళు మూసుకుని...