Hyderabad, సెప్టెంబర్ 13 -- కుజుడు సెప్టెంబర్ 13న రాత్రి 9:34కు కన్య రాశిని వదిలి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 26 వరకు అదే రాశిలో ఉంటాడు. కుజుడుని శక్తి, ధైర్యం, శౌర్యం, శ్రద్ధకు చిహ్నంగా భావిస్తారు. మేష రాశి, వృశ్చిక రాశికి కుజుడు అధిపతి. కుజుడు మకర రాశిలో ఉచ్చ స్థితిలో ఉండగా, కర్కాటక రాశిలో బలహీనంగా ఉంటాడు.

శుక్రుడు తులా రాశికి అధిపతి. కుజుడు తులా రాశిలోకి ప్రవేశించడంతో సెప్టెంబర్ 13 నుంచి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పరిహారాలు కూడా పాటించాలి. మరి తులా రాశిలోకి కుజుడు ప్రవేశించడంతో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి? ఎవరు ఎలాంటి పరిహారాలను పాటించాలి వంటి విషయాలను తెలుసుకుందాం.

మేష రాశి వారికి ఈ సంచారం చిన్నపాటి సమస్యలను తీసుకు వస్తుంది. ఈ రాశివారు ఎక్కువ టెన్షన్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అపార్థాలు కూడా ఎదురవ్వచ్చు...