Hyderabad, ఆగస్టు 9 -- ఈసారి రాఖీ పండుగ ఆగస్టు 9 శనివారం నాడు వచ్చింది. సంతోషంగా అన్నయ్యలు, తమ్ముళ్లతో అక్క చెల్లెళ్లు సరదాగా జరుపుకుంటారు. అయితే ఈసారి రాఖీ పండుగ కొన్ని ప్రత్యేక సంఖ్యల వారికి శుభ సంకేతాలని అందిస్తోంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారికి రాఖీ పండుగ నాడు అదృష్టం కలిసి వస్తుంది.

న్యూమరాలజీ మన భవిష్యత్తు చెప్పడంతో పాటు ప్రవర్తన తీరు ఎలా ఉంటుందనేది కూడా చెబుతుంది. న్యూమరాలజీ ప్రకారం రాఖీ పండుగ కొన్ని తేదీల్లో పుట్టిన వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. మరి ఏ సంఖ్యల వారు రాఖీ పండుగ నాడు మంచి ఫలితాలను పొందుతారు తెలుసుకుందాం.

నంబర్ 1, 3, 5, 6, 9 వారికి రాఖీ పండుగ అదృష్టం తెస్తుంది. ఈ సంఖ్యల వారు సంతోషంగా ఉంటారు. పైగా అనేక లాభాలు కూడా కలిగి ఉంటాయి.

ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 1 అవుతుంది. ర...