భారతదేశం, నవంబర్ 28 -- న్యూమరాలజీ అనేక విషయాలను చెబుతుంది. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తుకు సంబంధించినవి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఒక్కో సంఖ్య వారికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక సంఖ్య వారితో పోల్చుకుంటే, మిగిలిన సంఖ్యల వారు విభిన్నంగా ఉంటారు. న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే, ఈ తేదీల్లో పుట్టిన వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.

ఈ తేదీల్లో పుట్టిన వారు తక్కువ మాట్లాడతారు, అలాగే మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. వీరిలో ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. మరి మీ మూల సంఖ్య ఏది? ఏ గ్రహం ఆ సంఖ్యకు అధిపతి? ప్రత్యేక లక్షణాలు కలిగిన సంఖ్యల వారి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినట్లయితే వారి మూలాంకం 4 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి రాహువు. ఈ సంఖ్య కలిగి...