Hyderabad, ఆగస్టు 20 -- రాశుల ఆధారంగా ఎలా అయితే ఒక మనిషి తీరు, ప్రవర్తన, భవిష్యత్తు చెప్తాము, న్యూమరాలజీ ఆధారంగా కూడా ఒక మనిషి పేరు, ప్రవర్తన, భవిష్యత్తును చెప్పవచ్చు. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి. పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ నెంబర్‌ని కనుగొనవచ్చు. జ్యోతిష్యం లాగే న్యూమరాలజీ కూడా జీవితాలను చాలా ప్రభావితం చేస్తుంది.

పుట్టిన తేదీ ఆధారంగా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. ఒక్కో సంఖ్య వారికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు రాడిక్స్ నెంబర్ నాలుగు కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. రాడిక్స్ నెంబర్ నాలుగుకి చెందిన వ్యక్తుల్లో ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఏదైనా నెలలో 4, 13, 22 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 4 అవుతుంది.

ఈ తేదీల్లో పుట్టిన వారు ఎంతో నిజాయితీగా ఉంటారు. పైగా బంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు...