Hyderabad, ఆగస్టు 29 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటు, భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా చెప్పొచ్చు. ప్రతి సంఖ్యకి కూడా అధిపతి ఉంటాడు. ఆ అధిపతి ప్రకారం అదృష్టం ఉంటుంది. రాహువు, శని కష్టపడితే మంచి ఫలితాలను ఇస్తారు. అదృష్టం కూడా కలిసి వస్తుంది.

ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 4 అవుతుంది. 4కి అధిపతి రాహువు. జీవితంలో ఎత్తుపల్లాలు ఉండేలా చేస్తాడు. మొదట్లో కాస్త ఛాలెంజ్లను ఎదుర్కొన్నా, తర్వాత అన్నీ సర్దుకుంటాయి. రాహువు అనుగ్రహంతో కొత్త దారి, అనేక అవకాశాలను ఇస్తాడు. అదే విధంగా ఈ తేదీల్లో పుట్టిన వారు ఇబ్బందులకు భయపడరు, వాటి నుంచి నేర్చుకుంటారు, ఇంకా దృఢంగా మారుతారు.

ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్...