Hyderabad, ఆగస్టు 18 -- రాశుల ఆధారంగా ఎలా అయితే మనిషి భవిష్యత్తు, ప్రవర్తన తీరు తెలుసుకోవచ్చు, అదేవిధంగా న్యూమరాలజీ ఆధారంగా కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. జ్యోతిషశాస్త్రంలో న్యూమరాలజీ కూడా ఒక భాగం. న్యూమరాలజీ మన జీవితాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. పుట్టిన తేదీ ఆధారంగా భవిష్యత్తు తెలుసుకోవచ్చు.

అదే విధంగా న్యూమరాలజీలో రాడిక్స్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఉంటాయి. గ్రహాల ఆధారంగా ఆ తేదీలో పుట్టిన వారికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు. ప్రేమ, సంపద ఇలా చాలా విషయాలను తెలుసుకోవచ్చు.

కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు బంగారం అని చెప్పొచ్చు. వారి వ్యక్తిత్వం ఎంతో బావుంటుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్తను ఎంతో బాగా చూసుకుంటారు. డబ్బు విషయంలో కూడా భర్తకు సపోర్ట్ చేస్తారు. మరి ఏ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్తకు అదృష్టం తీసుకువస్తారు, భర్తను బా...