Hyderabad, ఆగస్టు 19 -- చాలా మంది రకరకాల రంగు రాళ్ళను ధరిస్తారు. రత్న శాస్త్రం ప్రకారం కొన్ని రత్నాలు సమస్యలను తొలగించి సంతోషాన్ని కలిగిస్తాయి. వాటిలో తెల్ల జిర్కాన్ ఒకటి. తెల్ల జిర్కాన్ ధరించడం వలన అనేక సమస్యలు తొలగిపోతాయి. ఇది కొంచెం వజ్రంలా ఉంటుంది. కొన్నిసార్లు వజ్రం కంటే ఎంతో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది.

ఈ రత్నాన్ని ధరించడం వలన డబ్బు నిలుస్తుంది, ఆర్థిక సమస్యలు ఉండవు, సంతోషంగా ఉండొచ్చు. డైమండ్ కంటే తక్కువ ధరకే లభిస్తుంది కానీ ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుంది. ఈ రత్నాన్ని ధరించడం వలన మానసిక ప్రశాంతతను కూడా పొందవచ్చు. జీవితంలో సానుకూలత కూడా పెరుగుతుంది. ఈ రత్నానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. అదే విధంగా ఏ రాశి వారికి ఈ రత్నం కలిసి వస్తుందో కూడా తెలుసుకుందాం.

ఈ రత్నాన్ని శుక్రవారం నాడు ధరిస్తే శుభ ఫలితాలను పొందవచ...