Hyderabad, సెప్టెంబర్ 16 -- ప్రముఖ ప్రపచనకారుడు గరికపాటి నరసింహారావు తెలుసు కదా. తెలుగు రాష్ట్రాల్లో చాగంటి కోటేశ్వరరావుతోపాటు ఈయన కూడా చాలా పాపులర్. అలాంటి ప్రవచనకర్త ఓ తెలుగు రొమాంటిక్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అసలు ప్రేమంటే ఏంటో ఈ సినిమా చూస్తే తెలుస్తుందని అన్నారు. ఈ సినిమా పేరు 8 వసంతాలు.

గరికపాటి నరసింహారావు ప్రవచనాలను తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఫాలో అవుతారు. తనదైన స్టైల్లో విమర్శలు, ప్రశంసలు చేసే ఆయన ఇప్పుడో తెలుగు సినిమా గురించీ మాట్లాడారు. జూన్ 20న థియేటర్లలో రిలీజైన 8 వసంతాలు సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆ వీడియోను ఈ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ మంగళవారం (సెప్టెంబర్ 16) తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేసింది.

"8 వసంతాలు సినిమా చూడండి. అసలు ప్రేమంటే ఏంటో తెలుస్తుంది. నేను చూశాను. శారీరక సౌఖ్యాలు, ఒకరి గ...