భారతదేశం, డిసెంబర్ 20 -- మీరు కొత్తగా కారు కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? లేదా ఇప్పటికే మీ దగ్గర కారు ఉందా? వాస్తవానికి ఈ కాలంలో కారు కొంటేనే సరిపోదు.. దాన్ని మెయిన్​టైన్​ చేయడం కూడా చాలా ముఖ్యం! కారు మేనేజ్​మెంట్​ని చాలా మంది కష్టమైన పనిగా చూస్తుంటారు. కానీ ఇది చాలా చాలా అవసరం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీ ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా కారు లైఫ్ కూడా పెరుగుతుంది.

మీ కారు ఎప్పుడూ కొత్త దానిలా మంచి కండిషన్‌లో ఉండాలంటే మీరు కచ్చితంగా పాటించాల్సిన కొన్ని సింపుల్​ టిప్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

1. టైర్లు- బ్యాటరీ మేనేజ్​మెంట్​-

టైర్లు: టైర్లపై ఉండే గ్రిప్ సరిగ్గా ఉందో లేదో ఎప్పుడూ చూసుకోవాలి. గ్రిప్ తగ్గితే రోడ్డుపై పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. సాధారణంగా టైర్లు 40,000 నుంచి 80,000 కిలోమీటర్ల వరకు వస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల...