భారతదేశం, ఆగస్టు 17 -- గూగుల్ తన నెక్ట్స్​ జనరేషన్​ ఫోల్డెబుల్ ఫోన్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్​ని భారత మార్కెట్‌లో ఆగస్ట్​ 21, 2025న విడుదల చేయనుంది. ఈ లాంచ్‌కు కొద్ది రోజుల ముందు, గూగుల్ గత ఏడాది విడుదల చేసిన పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ 5జీ మొబైల్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్​ని ప్రకటించింది. దీనితో ఇప్పుడు ఈ ఫోల్డెబుల్ ఫోన్‌ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న 'ఫ్రీడమ్ సేల్'లో భాగంగా ఈ డిస్కౌంట్, ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్‌తో ఈ ఫోల్డెబుల్ స్మార్ట్​ఫోన్‌ను రూ.1,30,000 లోపే కొనుగోలు చేయవచ్చు. మరి పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ కోసం వేచి చూడాలా? లేక ఇప్పుడు తగ్గిన ధరకే పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ కొనేయాలా? ఇక్కడ తెలుసుకుందాము..

16జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అయిన గూగుల్ ...