భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఓ యంగ్ హీరోపై పాపులర్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ ప్రశంసలు కురిపించేశాడు. ఆ కుర్రాడు నేచురల్ స్టార్ నానినే దాటేస్తాడని పేర్కొన్నాడు. కథా రచయిత, ప్రొడ్యూసర్ కోన వెంకట్ ఇంతలా పొగిడేసిన ఆ యువ హీరో ఏవరో కాదు.. అతనే హర్ష్ రోషన్. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న 'బ్యాండ్ మేళం' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్లో కోన వెంకట్ ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న బ్యాండ్ మేళం మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో కోన వెంకట్ కామెంట్లు వైరల్ గా మారాయి. ''ఇది మీకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ గ్లింప్స్ ను ఫస్ట్ డైరెక్టర్ బాబీకి చూపించా. అతను మరోసారి ప్లే చేయమన్నాడు. 'ఏం ఆర్టిస్ట్ సార్ ఇతను, రోషన్ మరో నాని అవుతాడు' అని నాకు బాబీ చెప్పాడు'' అని కోన వెంకట్ అన్నాడు.

''అతను (హర్ష్ రోషన్) తెలుగు...