భారతదేశం, అక్టోబర్ 3 -- బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది లేటెస్ట్ మూవీ 'కాంతార చాప్టర్ 1'. దసరా సందర్భంగా గురువారం (అక్టోబర్ 2) ఈ సినిమా రిలీజైంది. భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు అదరగొడుతోంది. సూపర్ హిట్ రివ్యూస్ అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగించే అవకాశముంది. మరి ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎంతకు దక్కించుకుందో చూద్దాం.

2022లో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1ను తెరకెక్కించాడు రిషబ్ శెట్టి. ఆయనే హీరో కూడా. గురువారం వచ్చిన మూవీకి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. మరోవైపు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడనే ప్రశ్న కూడా వస్తోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.

కాంతార సూపర్ హిట్ కావడంతో కాంతార చాప...