Hyderabad, సెప్టెంబర్ 25 -- గ్రహాలు ఎప్పటికప్పుడు శుభ యోగాలను తీసుకొస్తూ ఉంటాయి. కాలానుగుణంగా గ్రహాలు మార్పు చెందడంతో ఫలితం ద్వాదశ రాశులపై పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే రాహువుని నీడగ్రహం అని అంటారు. రాహువు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. అదేవిధంగా నక్షత్రాలని కూడా మారుస్తాడు. దీపావళి తర్వాత రాహువు నక్షత్రం మార్పు చేస్తాడు. రాహువు నక్షత్ర సంచారం ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం శుభ ఫలితాలను ఎదుర్కొంటారు.

ఈ ఏడాది దీపావళి తర్వాత రాహువు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. రాహువు శతభిష నక్షత్రంలోకి అడుగు పెడతాడు. రాహువు ఈ నక్షత్రానికి అధిపతి. సొంత నక్షత్రంలోకి రాహువు అడుగుపెట్టడంతో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మూడు రాశుల వారు అనేక విధాలుగా...