భారతదేశం, జూలై 4 -- తన బోర్డు ఆఫ్ డైరెక్టర్లు తమ వాటాదారులకు 2.50% డివిడెండ్ చెల్లించడానికి రికార్డు తేదీని ఈ జులై 11, 2025 (శుక్రవారం)గా నిర్ణయించినట్లు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తాజాగా ప్రకటించింది. ఈ వివరాలను ఎక్స్​ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.

"2025 ఏప్రిల్ 26న జరిగిన సమావేశంలో బోర్డు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్‌ను పరిగణించి సిఫార్సు చేసింది. దీనికి సంబంధించి, డివిడెండ్ పొందడానికి అర్హులైన సభ్యులను నిర్ణయించడానికి రికార్డు తేదీ 2025 జులై 11, శుక్రవారం అని గమనించగలరు," అని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ గురువారం బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది.

రికార్డు తేదీ అనేది ఒక కంపెనీ ఏ వాటాదారు డివిడెండ్ పొందడానికి అర్హుడు? అని నిర్ణయించడానికి ఉపయోగించే కట్-ఆఫ్ డేట్​. రాబోయే డివిడెండ్ చెల్లింపుకు అర్హత పొందాలంటే, పెట్టుబడిదారుడు ఎక్స్-డివిడెండ...