Hyderabad, ఆగస్టు 5 -- బాలీవుడ్ మూవీ సయ్యారా సంచలన బాక్సాఫీస్ రన్ కొనసాగుతోంది. కొత్త నటీనటులు అహాన్ పాండే, అనీత్ పడ్డా నటించిన ఈ రొమాంటిక్ మ్యూజికల్ మూవీ మూడు వారాల్లో రూ.500 కోట్ల మార్కును దాటింది. ఈ వార్తను సోషల్ మీడియా ద్వారా యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) షేర్ చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది అత్యధిక వసూళ్లు సాధించిన లవ్ స్టోరీ కావడం విశేషం.

సయ్యారా ఈ ఏడాది అసలు ఊహించని హిట్. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ లవ్ స్టోరీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. తాజాగా తమ మూవీ సాధించిన ఘనత గురించి షేర్ చేస్తూ.. "సయ్యారా మీ హృదయాల్లో ఒక స్థానం సంపాదించుకుంది. అందుకు మేము ఎంతో కృతజ్ఞులం" అని రాసింది.

యష్ రాజ్ ఫిల్మ్స్ టీమ్ ప్రకారం 'సయ్యారా' 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.507 కోట్లు వసూలు చేసింది. సినిమాను నిర్మి...