Hyderabad, అక్టోబర్ 3 -- దీపావళి పండుగ 2025: హిందువులు జరుపుకునే విశిష్టమైన పండుగలో దీపావళి పండుగ కూడా ఒకటి. ప్రతీ ఏటా ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య నాడు దీపావళి పండుగ వస్తుంది. దీపావళి పండుగ అంటే దీపాల పండుగ అని చెప్పొచ్చు. అదే విధంగా దీపావళి నాడు టపాసులు కాలుస్తారు, పిండి వంటలు వండుతారు, స్వీట్లు వంటివి పంచిపెడతారు.

దీపావళి అంటే దీపాల వరుస అని అర్థము. చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటాము. కేవలం హిందువులే కాదు, సిక్కులు, బౌద్ధులు, జైనులు కూడా ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఏటా ఈ పండుగను ఐదు రోజుల పాటు జరుపుతారు.

ఈసారి దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది? ధంతేరాస్‌, నరక చతుర్దశి కూడా ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం. ఐదు రోజుల అందమైన పండుగ దీపావళి పండుగ ధంతేరాస్‌తో మొదలై, భాయ్ దూజ్‌తో ముగుస్తుంది. దీపావళి...