Hyderabad, అక్టోబర్ 6 -- ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య నాడు దీపావళి జరుపుకుంటాము. దీపావళి పండుగను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఆనందిస్తారు. దీపావళి తర్వాత రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. ఈ ఏడాది కార్తీక మాసం ఎప్పుడు మొదలవుతుంది? కార్తీక మాసం తేదీ, ప్రారంభ తేదీ, పూజా విధానం, పాటించాల్సిన నియమాలు మొదలైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కార్తీక మాసం 30 రోజులు కూడా పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ 30 రోజుల పాటు ఏం చేయాలి? కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలతో పాటు పూర్తి వివరాలను తెలుసుకుందాం.

కార్తీక మాసంలో ప్రతిరోజు తలస్నానం చెయ్యాలి. కుదిరితే నది, చెరువు లేదా నూతి నీటితో స్నానం చేయడం మంచిది. ఒకవేళ అనారోగ్య సమస్య ఉండి వీలు కుదరకపోయినా పర్వదినాలప్పుడు నది స్నానం చేస్తే మంచిది.

రోజూ చెయ్యలేని వారు కార్తీక...