భారతదేశం, డిసెంబర్ 18 -- 2025 Last Amavasya: అమావాస్య నాడు పితృ దేవతలను ఆరాధించే సంప్రదాయం ఉంది. అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణాలు వదలడం వంటివి చేస్తారు. అలాగే తోచినది దానం చేయడం వంటివి కూడా అమావాస్య నాడు ఆచరిస్తారు. హిందూ సంప్రదాయంలో ప్రతి మాసంలో వచ్చే అమావాస్య నాడు చంద్రుడిని కూడా ఆరాధిస్తారు. చంద్రుడిని అమావాస్య నాడు పూజించడం వలన కోరికలన్నీ తీరుతాయని నమ్ముతారు. అమావాస్య నాడు అష్టైశ్వర్యాలు, ధన ప్రాప్తి కలగడానికి దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు.

ఈ ఏడాదిలో వచ్చే చివరి అమావాస్య (2025 last amavasya) రేపు అనగా డిసెంబర్ 19న వచ్చింది. అమావాస్య తిథి డిసెంబర్ 19 ఉదయం 4:19కి ప్రారంభమై, డిసెంబర్ 20 ఉదయం 7:13తో ముగుస్తుంది. ఈ లెక్కన డిసెంబర్ 19, శుక్రవారం నాడు అమావాస్యను పాటించాలి.

బ్రహ్మ ముహూర్తం: ఉదయం 4:30 నుంచి ఉదయం 5:25 వరకు

విజయ ముహూర్తం: ...