Hyderabad, అక్టోబర్ 11 -- ఏ పూజ చేసినా మొట్టమొదట వినాయకుడిని పూజిస్తాము. వినాయకుడిని ఆరాధించడం వలన విఘ్నాలు అన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చని, మనం చేసే పనిలో ఆటంకాలు తొలగిపోతాయని అందరూ నమ్ముతారు. అయితే వినాయకుడి ఆలయాలు చాలా ఉన్నాయి. శక్తివంతమైన వినాయక ఆలయాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియదు.

ఇది చాలా శక్తివంతమైన ఆలయం. ఇక్కడికి వెళ్లి వినాయకుడికి ఒక్క రూపాయి సమర్పిస్తే సరిపోతుంది. కోరికలన్నీ తీరిపోతాయి. మరి మన కోరికలన్నీ తీర్చేసే ఆ వినాయక ఆలయం ఎక్కడ ఉంది? ఈ రూపాయి గణపతి ఆలయానికి సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

గణపతికి వివిధ రూపాలు ఉంటాయన్న విషయం మనకు తెలుసు, కానీ రూపాయి గణపతి ఉన్నారన్న విషయం మనకే తెలియదు. రూపాయి గణపతి అంటే రూపాయలతో చేసినది కాదు. ఈ ఆలయానికి వెళ్లి ఒక్క రూపాయి సమర్పిస్తే కోరికలను తీర్చ...