Hyderabad, సెప్టెంబర్ 17 -- తలుపులమ్మ లోవ ఆలయం గురించి మీరు వినే ఉంటారు. తలుపులమ్మ తల్లి అమ్మవారు అక్కడ కొలువై ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని మండలంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. తునికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. నిత్యం ఇక్కడికి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయం చుట్టూ కొండలు, లోయలు ఉంటాయి. ఈ కారణంగా ఈ ఆలయం చాలా ప్రశాంతంగా, అందమైన వాతావరణంతో నిండి ఉంటుంది.

తలుపులమ్మతల్లి ఈ ఆలయంలో స్వయంగా వెలిశారు. అమ్మవారిని తలుపులమ్మ తల్లి అని ఎందుకంటారు అంటే, అమ్మవారు భక్తులకు వరాలు ఇవ్వడానికి తలపు సరిపోతుందని (తలపు అంటే ఆలోచన అని అర్థం). అందుకే తలుపులమ్మ తల్లి అని పిలుస్తారు. ప్రమాదాల నుంచి కాపాడుతుందని విశ్వాసం.

ఇక్కడ తలుపులమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్న చెట్టుకి వాహన నెంబర్ ప్లేట్లను కడతారు. కొంత మంది వాహన నెంబర్ ప్లేట్లను...