Hyderabad, ఆగస్టు 18 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఇవి శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను అందిస్తాయి. శని కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అదే విధంగా నక్షత్ర సంచారం కూడా చేస్తూ ఉంటాడు. ఈరోజు ఆగస్టు 18న శని నక్షత్ర సంచారంలో మార్పు చోటుచేసుకుంది. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆగస్టు 18న శని నక్షత్ర సంచారంలో మార్పు జరగనుంది. ఇది అనేక రాశుల వారికి ప్రయోజనాలను సృష్టిస్తోంది. శని నక్షత్రం మార్పు ప్రత్యేకమైనదని అంటారు. నిజానికి గురువు నక్షత్రమైన ఉత్తరాభాద్రపదంలో శని ఇప్పటికే సంచారం చేస్తున్నాడు, కానీ ఇప్పుడు నాల్గవ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. బృహస్పతి నక్షత్రం కావడం వ...