Hyderabad, ఆగస్టు 26 -- ముత్యం, మాణిక్యం, వజ్రం, పుష్యరాగం, మరకతం, పగడం, నీలం, గోమేధికం, వైడూర్యాన్ని నవరత్నాలు అంటారు. ఈ తొమ్మిది రత్నాలు జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ప్రతీకగా ఈ నవరత్నాలను వాడతారు. వీటిని నవరత్న ఉంగరాల్లో వేసి ధరిస్తారు. రత్న శాస్త్రం ప్రకారం రత్నాలకు ఎంతో విశిష్టత ఉంది. ఇవి జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తాయి. అదే విధంగా కష్టాల నుంచి బయటపడేస్తాయి, అదృష్టాన్ని కూడా కలిగిస్తాయి.

నవరత్న ఉంగరాలను ధరించడం వలన అనేక మార్పులు వస్తాయి. ఏ రాశుల వారికి నవరత్నాలు కలిసి వస్తాయి, ఎవరు ధరిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ రత్నాలు జీవితంలో శాంతి, స్థిరత్వం, ధనం వంటి వాటిని కలిగిస్తాయి.

ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని అందిస్తాయి. నవ రత్నాలను ధరించడం వల...