భారతదేశం, ఏప్రిల్ 18 -- వాస్తు శాస్త్రంలో ఇంటి ప్రతి దిశకూ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కానీ, అన్నింటికంటే పవిత్రమైనదిగా 'ఈశాన్యం'. పురాణాల ప్రకారం, వాస్తు పురుషుని శిరస్సు ఈ దిశలోనే ఉంటుంది. అందుకే దీనిని 'దేవ మూల' అని పిలుస్తారు. ఈ మూల ఎంత ప్రశాంతంగా, శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో అంతటి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అయితే, చాలా మంది అవగాహన లేక ఈశాన్యంలో అనవసరమైన వస్తువులు పెట్టి వాస్తు దోషాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈశాన్య మూలలో పొరపాటున కూడా ఉండకూడని వస్తువులు ఏవో ఇప్పుడు చూద్దాం.

ఈశాన్యం సాక్షాత్తు పరమేశ్వరుడికి, గంగా దేవికి నిలయం. అంతటి పవిత్రమైన చోట చెప్పుల స్టాండ్లు పెట్టడం లేదా చెత్తబుట్టలను ఉంచడం అంటే దైవశక్తిని అవమానించడమే. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించి, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు రేకెత్తే ప్రమాదం ఉంది. ఈ ప్రాం...