Hyderabad, అక్టోబర్ 7 -- ఓటీటీ వచ్చిన తర్వాత క్రైమ్ థ్రిల్లర్ జానర్ వెబ్ సిరీస్ కు ఫ్యాన్స్ పెరిగారు. అలాంటి వారి కోసం ఈ శుక్రవారం (అక్టోబర్ 10) జియోహాట్‌స్టార్ లోకి సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ అనే సిరీస్ రాబోతోంది. అయితే అదే జియోహాట్‌స్టార్, జీ5 ఓటీటీల్లో ఇప్పటికే 5 ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో చూడండి.

ఇప్పటి వరకూ ఇండియన్ ఓటీటీ స్పేస్ లో వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి ఈ స్పెషల్ ఆప్స్. ఇప్పటికే రెండు సీజన్లు జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కే కే మీనన్ రా ఏజెంట్ హిమ్మత్ సింగ్‌గా నటించిన ఇండియన్ స్పై క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. అనేక ఉగ్రదాడుల వెనుక ఉన్న సూత్రధారిని ట్రాక్ చేయడానికి హిమ్మత్ ఒక టాస్క్ ఫోర్స్‌ను నడిపిస్తాడు. నిజ జీవిత గూఢచర్యం, జాతీయ సంఘటనల నుండి ...