భారతదేశం, మార్చి 14 -- పాపాలను తొలగించే పాపమోచని ఏకాదశి చాలా విశేషమైనది. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. పాపమోచని ఏకాదశి నాడు కొన్ని పద్ధతులు పాటించి, పరిహారాలను ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఫాల్గుణ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని పాపమోచని ఏకాదశిగా జరుపుకుంటాము. ఈరోజు ఉపవాసం ఉండి విష్ణువును భక్తి, శ్రద్ధలతో ఆరాధిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి.

పాపమోచని ఏకాదశి నాడు షోడశోపచారాలతో విష్ణువును ఆరాధించి, బ్రాహ్మణులకు భోజనం పెట్టి, సోదరులతో పాటు భోజనం చేస్తే చాలా మంచిదని చెబుతారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు కూడా తొలగిపోతాయి.

పాపమోచని ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. అనేక రకాల రోగాల బాధల నుంచి కూడా సులువుగా బయట పడేందుకు వీలవు...