భారతదేశం, నవంబర్ 2 -- ప్రతి ఏటా కార్తీకమాసంలో వచ్చే శుక్ల పక్ష ద్వాదశి నాడు క్షీరాబ్ది ద్వాదశిని జరుపుకుంటాము. ఈ ఏడాది నవంబర్ 2 అంటే ఈరోజు వచ్చింది. ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ఈరోజు తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే క్షీరాబ్ధి ద్వాదశి నాడు తులసికి వివాహాన్ని జరిపిస్తారు. తులసి పూజ ఎందుకు చేయాలి? అసలు తులసి చెట్టుకు ఎవరు తాళి కడతారు? ఎవరితో పెళ్లి జరుగుతుంది? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కాలనేమి అనే రాక్షసుడికి అందమైన కూతురు పుడుతుంది. ఆమె తులసీ దేవి. ఆమెను వృందగా పిలుస్తారు. ఆమె జలంధర్ అనే ఒక రాక్షసుడిని పెళ్లి చేసుకుంటుంది. శివుడు మూడో కన్ను నుంచి వచ్చిన అగ్నిలో పుట్టడం వలన అతనికి ఎక్కువ శక్తులు ఉంటాయి. జలంధరునికి దేవుళ్లు అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ దేవుళ్ళంటే ఎంతో ఇష్టమైన వృందను ప్రేమిస్తాడు. ఆమె ...