ఈరోజే కార్తీక శుక్ల ఏకాదశి.. 24 ఏకాదశుల్లో ఉత్థాన ఏకాదశి ఎందుకు ప్రత్యేకం? విష్ణుమూర్తి ఆరాధనతో పాటు ఈ పనులు చేయండి!
భారతదేశం, నవంబర్ 20 -- నాలుగు నెలల యోగనిద్ర తర్వాత శ్రీమహావిష్ణువు మేల్కొనే ఈ పర్వదినానికి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది నవంబర్ 21న అంటే ఈరోజు కార్తీక శుక్ల ఏకాదశి వచ్చింది. దీనినే దేవ ఉత్థాని ఏకాదశి అంటారు. శాస్త్ర వచనాల ప్రకారం దశమితో కూడిన ఏకాదశి కంటే, ద్వాదశితో కూడిన ఏకాదశికి ఉపవాసం ఉండటం అత్యంత శ్రేష్ఠం. నవంబర్ 21న ద్వాదశి ఘడియలతో కూడిన ఏకాదశి రావడం ఎంతో శుభప్రదమని, దీనికి త్రయోదశి తిథి కూడా తోడైతే వ్రత ఫలితం రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు.
ఏకాదశి ఉపవాసం కేవలం ఒక్క రోజుకే పరిమితం కాదని, దీని నియమాలు దశమి తిథి నుంచే మొదలవుతాయి. దశమి, ఏకాదశి, ద్వాదశి.. ఇలా మొత్తం మూడు రోజుల పాటు భక్తులు అత్యంత నిష్ఠతో, భగవంతుడి నామస్మరణలో గడపాలి. దశమి రోజున కేవలం ఒక్క పూట మాత్రమే సాత్విక భోజనం చేయాలి, సూర్యాస్తమయం తర్వాత ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.