Hyderabad, సెప్టెంబర్ 17 -- ప్రతి ఏడాదికి 24 ఏకాదశిలు ఉంటాయి. ఈ ఏకాదశుల నాడు ఉపవాసం ఉండే విష్ణుమూర్తిని పూజిస్తారు. పితృపక్షంలో ఇందిరా ఏకాదశి వస్తుంది. వ్యాసమహర్షి రచించిన భవిష్య పురాణం ప్రకారం చూస్తే ఇందిరా ఏకాదశి పితృపక్షంలో వస్తుంది. ఆ రోజున పూర్వికులను స్మరిస్తారు. పూర్వీకులకు పూజలు చేయడం వలన శుభఫలితాలు లభిస్తాయి. అదేవిధంగా ఈ ఏకాదశి నాడు భక్తిశ్రద్ధలతో పూజిస్తే వంశాభివృద్ధి జరుగుతుంది.

పితృపక్షం బహుళ పక్షం నుంచి అమావాస్య వరకు ఉంటుంది. ఈ 15 రోజులు కూడా చనిపోయిన పూర్వీకులకు తర్పణాలు వదలడం, వారి పేరు చెప్పి దానాలు చేయడం లాంటివి చేస్తారు. అలా చేయడం వలన పితృదేవతలు అనుగ్రహం కలిగి, వంశాభివృద్ధి కలుగుతుంది.

ప్రతి ఏటా భాద్రపద బహుళ ఏకాదశిని ఇందిరా ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇందిరా ఏకాదశి సెప్టెంబర్ 17 అంటే ఈరోజు వచ్చింది. పితృదేవతలను స...