Hyderabad, అక్టోబర్ 2 -- ఈ ఏడాది అక్టోబర్ 2న దసరా లేదా విజయదశమి జరుపుకుంటాము. దసరా చాలా ముఖ్యమైన పండుగ. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం, దశమి నాడు ఈ పండుగను జరుపుకుంటాము. ప్రతి ఏడాది తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు జరుపుతాము.

దసరా నవరాత్రుల్లో అమ్మవారి తొమ్మిది రూపాలను పెట్టి పూజిస్తాము. చెడుపై మంచి గెలిచిందని ప్రతీకగా ఈ పండుగను జరుపుతాము. రావణుడిపై రాముడు సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగను జరుపుతారు. పైగా ఈ పండుగ నాడు దాన ధర్మాలు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది.

ఈ పండుగ మనకు ధర్మ ప్రాముఖ్యతను తెలుపుతుంది. సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం చూసినట్టయితే విజయ దశమి నాడు చేసే పనులకు ఎన్నో రెట్లు ఫలితం వస్తుంది. ఆనందం, ప్రేయసి, శాంతి కలుగుతాయి. అయితే విజయ దశమి నాడు వేటిని దానం చేస్తే మంచి జరుగుతుంది? అమ్మ అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుక...