భారతదేశం, నవంబర్ 11 -- హిందూ సంప్రదాయంలో బుధవారం రోజున విఘ్నేశ్వరుడైన గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. బుధవారం నాడు ప్రథమ పూజ్యుడిని స్మరించుకోవడం వల్ల సకల కార్యాసిద్ధి కలుగుతుందని, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని ప్రగాఢ నమ్మకం. జ్యోతిష్య నిపుణుల గణన ప్రకారం, ఈరోజు గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను అందించనుండగా, మరికొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రోజూవారీ కార్యకలాపాలు, కెరీర్, ఆరోగ్యం పరంగా ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు సవివరంగా చూద్దాం.

మేష రాశి జాతకులు ఇతరుల చిన్నచిన్న తప్పులను పెద్ద మనసుతో క్షమించే ఉదార స్వభావంతో ఉంటారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి అవసరమైన ధనాన్ని సమకూర్చుకోవడంలో సఫలమవుతారు. రోజూవారీ జీవితంలో యోగా, ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీ ఆసక్...