భారతదేశం, ఏప్రిల్ 15 -- ఈరోజు ఏప్రిల్ 15, బుధవారం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికల ఆధారంగా ప్రతి రోజూ మన భవిష్యత్తు మారుతూ ఉంటుంది. సాధారణంగా బుధవారం అంటే గణనాథుడిని పూజిస్తాం. మరొక విశేషం ఉంది. అదే 'బుధ ప్రదోష వ్రతం'. ప్రదోష కాలంలో పరమశివుడిని ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి, కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా సుఖ సంతోషాలు, సిరిసంపదల కోసం శివారాధన చేయడం ఉత్తమం. ఈ నేపథ్యంలో 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికి శుభం కలుగుతుంది? ఎవరికి సవాళ్లు ఎదురవుతాయి? అనే పూర్తి వివరాలు మీకోసం.

ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. అయితే, మీ భావోద్వేగాలపై కొంచెం నియంత్రణ ఉంచుకోవడం మంచిది. సహనంతో వ్యవహరించండి. వ్యాపారంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు.

గ్రహాల స్థితి వల్ల...