భారతదేశం, జనవరి 3 -- ఈరోజు పుష్య పౌర్ణమి. పుష్య మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనది. అందులోనూ ఈ పుష్య పౌర్ణమి నాడు చంద్రుడు మరింత కాంతితో ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు. ఇది వుల్ఫ్ సూపర్ మూన్. 2026లో వచ్చే తొలి పౌర్ణమి ఇది. సాధారణ పౌర్ణమిలా కాదు. ఇది వుల్ఫ్ సూపర్ మూన్. సాధారణ పౌర్ణమి కంటే 14% పెద్దగా, 30% ఎక్కువ ప్రకాశంతో చంద్రుడు దర్శనం ఇవ్వబోతున్నాడు.

ఈ పౌర్ణమికి వుల్ఫ్ మూన్/ తోడేళ్ళ పౌర్ణమి అనే పేరు రావడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. ఉత్తర అమెరికాలో ఉన్న ప్రజల విశ్వాసాల ప్రకారం, జనవరి నెలలో శీతాకాల తీవ్రత కారణంగా తోడేళ్లు ఎక్కువగా మూలుగుతూ ఉంటాయి. అలా ఈ పౌర్ణమికి వుల్ఫ్ మూన్ అనే పేరు వచ్చిందని అంటారు.

పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి విష్ణువును, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. సత్యనారాయణ వ్రతం చేసుకుంటే కూడా మంచి జరుగుతుందని భావిస్త...