Hyderabad, జూలై 29 -- గ్రహాలు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా గ్రహాలు మార్పు చెందినపుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. గ్రహాలు కాలానుగుణంగా ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రంలోకి కూడా ప్రవేశిస్తూ ఉంటాయి. బుధుడు మరోసారి నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను, కొన్ని రాశుల వారికి శుభ ఫలితాను, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలని తీసుకువస్తుంది.

జూలై 29, అంటే ఈరోజు సాయంత్రం 4:17కి పుష్యమి నక్షత్రంలోకి బుధుడు అడుగుపెట్టబోతున్నాడు. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని. పుష్యమి నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. మరి ఏ రాశుల వారు బుధుడి నక్షత్ర సంచారంతో ప్రయోజనాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

మిధున రాశి వారికి బుధుడి నక్షత్ర సంచారం శుభ ఫలితాలను తీసుకొస్తుంద...