Hyderabad, సెప్టెంబర్ 22 -- ఈరోజు నుంచి దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి. తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. పురాణ గ్రంథాల ప్రకారం చూసినట్లయితే ఒక్కో దేవతకు ఒక్కో పువ్వు అంటే ఎంత ఇష్టం. మరి ఈ దసరా నవరాత్రుల్లో ఏ రోజు ఏ పూలను సమర్పించడం వలన అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయి?

సానుకూల శక్తి లభించాలంటే ఏ పూలను సమర్పించాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తొమ్మిది రోజులు ఏ పూలను ఎప్పుడు సమర్పించాలో తెలుసుకుంటే శుభ ఫలితాలను పొందవచ్చు. శ్రేయస్సు, అదృష్టాన్ని కూడా కలిగేలా చేసుకోవచ్చు.

మొదటి రోజు శైలపుత్రి పూజ. ఈరోజు అమ్మవారికి తెల్లటి పువ్వులను లేదా తెల్లటి కమలాలను సమర్పించడం మంచిది. ఈ పూలను సమర్పించడం వలన జీవితంలో శాంతి ఉంటుంది, స్థిరత్వం కూడా ఉంటుంది.

రెండవ రోజు అమ్మవారికి మల్లెపూలు, గులాబీలు స...