Hyderabad, జూలై 18 -- అథర్వ, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ థ్రిల్లర్ మూవీ 'DNA' శనివారం (జులై 19) ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను జియోహాట్‌స్టార్ దక్కించుకుంది. అయితే ఈ మూవీ నిజానికి తెలుగులో శుక్రవారమే (జులై 18) రిలీజ్ కావడమే ఇక్కడ అసలు విశేషం. ఒక్క రోజు వ్యవధిలోనే డిజిటల్ ప్రీమియర్ కానుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మలయాళం నటి నిమిషా సజయన్, తమిళ నటుడు అథర్వ మురళి మొదటిసారిగా తమిళ థ్రిల్లర్ డ్రామా 'డీఎన్ఏ' కోసం కలిసి నటించారు. 'ఫర్హానా', 'మాన్‌స్టర్' లాంటి సినిమాలతో పేరుగాంచిన దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

తమిళంలో జూన్‌లో థియేటర్లలో విడుదలైన 'DNA' ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా శనివారం (జులై 19) జియోహాట్‌స్టార్ ఓటీటీలో తమిళం, తెలుగు, మలయాళం,...