భారతదేశం, మే 21 -- ఈరోజు చాలా శక్తివంతమైన రోజు. గురువారం, పైగా పుష్యమి నక్షత్రం, పంచమి తిధి ఉంది. ఇది చాలా అరుదైన పవిత్ర కలయిక అని చెప్పవచ్చు. గురు పుష్యమి యోగం చాలా పవిత్రమైనది. ఎప్పుడైనా సరే గురువారం రోజు పుష్యమి నక్షత్రం వచ్చినట్లయితే దానిని గురు పుష్యమి యోగం అని అంటారు. ఈ రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే అక్షయ ఫలితాలు కలుగుతాయి. ఈ యోగంలో చేసే శుభకార్యాలకు ఎంతో మంచి ఫలితం లభిస్తుంది. అలాగే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా, ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా ఇది చాలా శుభదినం. బంగారం, విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా గురు పుష్యమి చాలా శుభప్రదమైన రోజు.

ఈరోజు ఇంట్లో దీపారాధన చేయడం వలన మహాలక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది.

ఈరోజు దీపారాధన చేసి మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన దరిద్రం తొలగిపోయి శుభ ఫలితాలను పొందవచ్చు.

అలాగే...