భారతదేశం, సెప్టెంబర్ 25 -- కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న సరికొత్త టాక్ షో 'టూ మచ్' ఇంటర్నెట్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ బ్రాండ్ న్యూ టాక్ షో ఇవాళ (సెప్టెంబర్ 25) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫస్ట్ ఎపిసోడ్ లో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ గెస్ట్ లుగా వచ్చారు. 'అందాజ్ అప్నా అప్నా' లో అమర్-ప్రేమ్ గా కలిసి నటించిన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇద్దరు ఖాన్స్ మళ్ళీ కలిసి కనిపించారు.

కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' టాక్ షో సెప్టెంబర్ 25, గురువారం ప్రారంభమవుతోంది. ఈ షో ప్రపంచవ్యాప్తంగా 240 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్స్ ప్రసారం అవుతాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియో ట్వీట్ చేస్తూ "మనమందరం కోరుకున్న అమర్-ప్రేమ్ రీ యూనియన్. ...