భారతదేశం, సెప్టెంబర్ 26 -- ఘాటి ఓటీటీ రిలీజ్: టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి లీడ్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ యాక్షన్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ 'ఘాటి' ఓటీటీలోకి వచ్చేసింది. సినిమా థియేటర్లలో రిలీజైన 20 రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ కు రావడం గమనార్హం. ఇవాళ (సెప్టెంబర్ 26) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందో ఓ లుక్కేయండి.

అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ 'ఘాటి' ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది. ఈ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీని చూడొచ్చు.

ఘాటి సినిమాకు క్రిష్ జాగర్లముడి డైరెక్టర్. గంజాయి స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ పై భారీ అ...