భారతదేశం, సెప్టెంబర్ 20 -- ఓటీటీలోకి ఇవాళ ఓ హారర్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. వణికించే సీన్లతో, భయపెట్టే సన్నివేశాలతో సాగే ఈ సినిమా హారర్ థ్రిల్లర్స్ ఫ్యాన్స్ కు ఓ మంచి ఫీస్ట్ లాంటిది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన అమెరికన్ సినిమా '28 ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్' ఈ రోజు (సెప్టెంబర్ 20) ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ హారర్ థ్రిల్లర్ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

బాక్సాఫీస్ ను షేక్ చేసిన అమెరికన్ హారర్ థ్రిల్లర్ '28 ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్' మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఇది అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

అమెరికన్ హారర్ థ్రిల్లర్ '28 ఇయర్స్ లేటర్' మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచ...