భారతదేశం, సెప్టెంబర్ 26 -- దసరా హాలీడేస్ లో ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు సినిమాలు క్యూ కడుతూనే ఉన్నాయి. ఈ వారం కూడా కొత్త సినిమాలు, సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇవాళ (సెప్టెంబర్ 26) కూడా భారీ సంఖ్యలో సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. ఇందులో నాలుగు మలయాళం సినిమాలున్నాయి. ఇవెంతో స్పెషల్ గా కనిపిస్తున్నాయి.

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ వరుసగా సూపర్ హిట్లు అందుకుంటున్నారు. ఎల్ 2 ఎంపురాన్, తుడరుమ్ తో అదరగొట్టారు. ఇప్పుడు 'హృద‌య‌పూర్వం'తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా రీసెంట్ గా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పుడీ మూవీ ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చింది. హృద‌య‌పూర్వం చిత్రం శుక్రవారం నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. గుండె మార్పిడి చేసుకున్న వ్యక్తి కథ చుట్టూ సిని...