భారతదేశం, డిసెంబర్ 22 -- ఓటీటీ ఆడియన్స్ కోసం కొత్త వారం సరికొత్తగా మొదలైంది. అదిరిపోయే హారర్ థ్రిల్లర్ ఇవాళ (డిసెంబర్ 22) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో, వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో వచ్చిన ఈ మూవీ పేరు 'టుగెదర్'. ఈ రోజు ఓటీటీలోకి వచ్చింది ఈ సినిమా. హారర్ థ్రిల్లర్లు ఇష్టపడే వాళ్లకు ఈ మూవీ మంచి ఫీస్ట్ లాంటిదే.

హారర్ థ్రిల్లర్లకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఇక అమెరికన్ హారర్ సూపర్ నేచురల్ థ్రిల్లర్లు అంటే మరింత ఆదరణ ఉంటుంది. ఈ సినిమాలు క్షణక్షణం భయపెడుతూ, ఒళ్లు గగుర్పొడిచేలా సాగుతాయి. ఇప్పుడు అలాంటి మూవీ 'టుగెదర్' ఓటీటీ ఆడియన్స్ ను భయపెట్టేందుకు వచ్చేసింది. సోమవారం ఓటీటీలో అడుగుపెట్టింది ఈ సినిమా.

ఇంగ్లీష్ సినిమా అయిన టుగెదర్ తెలుగులోనూ మన ఆడియన్స్ కోసం అందుబాటులోకి వచ్చింది. ప్రైమ్ వీడియోలో ఈ హారర్ థ్రిల్లర్ ...