భారతదేశం, మే 20 -- ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 20 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 20 ఎపిసోడ్ లో.. తండ్రి రామరాజుపై రూ.5 లక్షలు విసిరిగొట్టిన సాగర్ ఇంట్లో నుంచి వెళ్లిపోతానంటాడు. నర్మద చేయి పట్టుకుని లాక్కెళ్తాడు. వేదవతి తన కొడుకును ఆపాలని చూస్తుంది. అమ్మా ఆపుతావా డ్రామాలు అని సాగర్ అంటాడు.

కన్న కొడుకు ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాడని నేను బాధపడితే నీకు డ్రామాలా కనిపిస్తుందా? అమ్మ ప్రేమకు ఇచ్చే విలువ ఇదేనా? అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. బుజ్జమ్మను ఆపిన రామరాజు.. సాగర్ ను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటాడు. రూ.5 లక్షలు ఇవ్వమంటే డబ్బు మనిషిలా కనిపించానే తప్పా, కొడుకును ఆపడానికే అలా అన్నానని వాడికి కనిపించడం లేదని రామరాజు సీరియస్ అవుతాడు.

కొడుకు కళ్ల ముందే ఉండాలనే నాన్న బాధ వాడికి అర్థం కావడం లేదు. నేను ఎన్నిసార్లు ఆపాలి. నీ భార్యను తీస...